కోరమీసంలో చరణ్ తాజా లుక్

Published on Aug 2, 2019 10:00 am IST

రాంచరణ్ నిన్న ముంబైలో సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీని కలవడం జరిగింది. ఇద్దరు బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో అక్కడున్న ఫోటో గ్రాఫర్లకు ఫోజ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. కాగా రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ” చిత్రంలో కియారా అద్వానీ నటించారు. ఆ చిత్రంలో వీరిద్దరూ, కొణిదెల రామ్, సీత అనే పాత్రలలో రొమాంటిక్ కపుల్ గా అలరించారు.

ముంబై వెళ్లిన రామ్ చరణ్ కియారా ను కాజ్వల్ గా కలవడం జరిగింది. ఇటీవల షాహిద్ కపూర్ సరసన కియారా అద్వానీ నటించిన అర్జున్ రెడ్డి మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్” ఘనవిజయం సాధించింది. ఆమె ఇప్పుడు రెండుకు పైగా హిందీ చిత్రాలలో నటిస్తున్నారు.

కాగా రామ్ చరణ్ తాజా లుక్ ఆసక్తికరంగా ఉంది. బాగా మెలితిప్పిన మీసంలో రామ్ చరణ్ రఫ్ లుక్ లో చాలా బాగున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి చరణ్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో మన్యం వీరుడు రామరాజు పాత్ర చేస్తున్న చరణ్ ఆ రోల్ కొరకు కోర మీసం పెంచినట్లున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది

సంబంధిత సమాచారం :