త్వరలో మొదలుకానున్న చరణ్, బోయపాటి సినిమా !
Published on Nov 20, 2017 5:20 pm IST

‘రంగస్థలం 1985’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రామ్ చరబ్ తేజ్ అది పూర్తవగానే మాస్ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రసుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చే నెలలో ముహూర్తం ఖరారు చేశారని వినికిడి.

అంతేగాక వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమా షూటింగ్ మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయట. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు. మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న చరణ్, మాస్ జనాలు పల్స్ బాగా తెలిసిన బోయపాటి కలయికలో వస్తున్న మొదటి సినిమా కాబట్టి దీనిపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగే ఈ సినిమా 2018 దసరా కానుకగా విడుదల కానుంది.

 
Like us on Facebook