చరణ్ సినిమా సెకండ్ షెడ్యూల్ వివరాలు !
Published on Feb 28, 2018 6:23 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తోన్న సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజా సమాచారం మేరకు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మర్చి రెండో వారం నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది. చరణ్ ఈ షెడ్యూల్ నుండి సెట్స్ లోకి జాయిన్ కాబోతున్నాడు. డివివి దానయ్య నిర్మించబోయే ఈ సినిమాలో కైరాఅద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతోంది. రాజస్తాన్ నేపద్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. స్నేహ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఆర్యన్ రాజేష్ చరణ్ బ్రదర్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో జర్నీ సినిమా హీరోయిన్ అనన్య చరణ్ వదిన పాత్రలో కనిపించబోతోంది.

 
Like us on Facebook