ప్రభుదేవా నాటు సర్ప్రైజ్ పై చరణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Mar 19, 2023 12:04 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇపుడు తన లాస్ట్ సెన్సేషనల్ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” హిట్ అలాగే ఆ సినిమా నాటు నాటు సాంగ్ కి గాను ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా నిలిచింది. ఇక ఈ ఈవెంట్ తర్వాత సినిమా యూనిట్ అందరికీ గ్రాండ్ వెల్కమ్ అందుకున్నారు.

మరి అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి కూడా హైదరాబాద్ ఢిల్లీ లలో గ్రాండ్ వెల్కమ్ అందించగా నిన్న అయితే చరణ్ కి తాను నెక్స్ట్ చేస్తున్న భారీ సినిమా నుంచి ఇండియన్ మైఖేల్ జాక్సన్ తమ సినిమాకి మళ్ళీ వస్తున్నందుకు గాను నాటు నాటు స్టెప్పేసి కంగ్రాట్స్ చెప్తూ స్వీట్ సర్ప్రైజ్ ని అందించారు.

మరి శంకర్ సినిమా నుంచి ఈ గిఫ్ట్ చూసిన చరణ్ ఇంతటి మంచి వెల్కమ్ ని అందించినందుకు చాలా థాంక్స్ చెప్తున్నానని అలాగే మా గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా స్వీట్ సర్ప్రైజ్ కి కూడా థాంక్స్ చెప్తున్నానని ఇప్పుడు RC15 షూట్ లో మళ్ళీ జాయిన్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని తాను తెలిపాడు. దీనితో తన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :