ఫిట్నెస్ కోసం చరణ్ తంటాలు అంతాఇంతా కాదు.

Published on Jul 10, 2020 11:11 am IST

హీరో రామ్ చరణ్ నేడు ఓ ఆసక్తికర పోస్ట్ పంచుకున్నారు. ఆయన తన మార్నింగ్ వర్కౌట్స్ సంబంధించి ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలకు వివరణగా వ్యాయామం విషయంలో తన మానసిక సంఘర్షణ గురించి ఓ వివరణ ఇచ్చారు. బుద్ది వ్యాయామం చేయమంటుంటే…మనసు మాత్రం హూ..అంటుందట. శ్రమ వలన వ్యాయామం వద్దనిపిస్తున్నా…ఫిట్ గా ఉండాలంటే తప్పదని బుద్ది చెవుతుందన్న అర్థంలో రామ్ చరణ్ ఆ వర్డ్స్ పోస్ట్ చేసి ఉంటారు.

కెరీర్ బిగినింగ్ నుండి రామ్ చరణ్ ఫిట్నెస్, బాడీ షేప్ పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. దానికి తోడు ఆయన భార్య ఉపాసన ఫిట్నెస్ మరియు డైట్ విషయంలో మంచి ఎక్సపర్ట్. చరణ్ ని ఎప్పుడూ గైడ్ చేస్తూ మంచి బాడీ షేప్ కలిగి ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More