బోయపాటి సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేయనున్న చరణ్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘రంగస్థలం 1985’ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో పూర్తికానున్న ఈ చిత్రం కోసం చరణ్ గత ఏడాది నుండి ఎక్కువ మొత్తంలో గడ్డం మైంటెయిన్ చేస్తూ వచ్చారు. కానీ జనవరి 19 నుండి ఆయన బోయపాటి శ్రీనుతో కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నారు.

ఈ సినిమాలో రెగ్యులర్ గా కాకుండా కొత్త లుక్ లో కనిపిస్తారట చరణ్. అందుకే త్వరలోనే గడ్డం తీసేసి కొత్త లుక్ కోసం మేకోవర్ మొదలుపెడతారని సమాచారం. డివివి దానయ్య నిర్మించనున్న ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశముందని తెలుస్తోంది. ఇకపోతే చివరి దశలో ఉన్న ‘రంగస్థలం 1985’ చిత్రం 2018 మార్చి 30న రిలీజ్ కానుంది.