ఇక ఆర్ ఆర్ ఆర్ హీరోలలో చరణ్ డిసైడ్ చేయాలి..!

Published on Feb 20, 2020 2:01 am IST

రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ లో హీరోలుగా లాక్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏడాదికిపైగా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది జులై 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ అనుకున్న ప్రణాళిక ప్రకారం జరగని కారణంగా మరో ఆరు నెలలకు వాయిదాపడింది. వచ్చే ఏడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీం కొద్ద్దిరోజుల క్రితం కొత్త విడుదల తేదీ ప్రకటించారు. అనగా దాదాపు ఏడాది తరువాత ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. ఐతే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందే తన తదుపరి చిత్రం ప్రకటించేశాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన మూవీ చేస్తున్నట్లు నేడు అధికారిక ప్రకటన రావడం జరిగింది.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ముగిసిన వెంటనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో 2021 వేసవిలో విడుదల ఉంటుందని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ మాత్రం ఇంకా ఏ దర్శకుడితో ఫిక్స్ కాలేదు. ఆయన ఆర్ ఆర్ ఆర్ తరువాత చేసే సినిమా గురించిన ప్రకటన చేయాల్సివుంది. తారక్ ప్రకటించేసిన నేపథ్యంలో రామ్ చరణ్ కూడా త్వరలో దీనిపై అప్డేట్ ఇచ్చే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More