
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ ని సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్ ఫిగర్స్ ని నమోదు చేస్తున్న ఈ సినిమా మొదటి వారంలో 30 కోట్ల షేర్ మార్క్ ని కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితమే తన తదుపరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే తమిళంలో హిట్ అయిన తాని ఓరువన్ సినిమాకి రీమేక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరియు నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాని డిసెంబర్ లో మొదలు పెడతాం అని చరణ్ ఇదివరకే తెలిపాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనుంది అనే విషయాన్ని మీకందిస్తున్నాం. ఈ సినిమాని డిసెంబర్ లో అధికారికంగా లాంచ్ చేసి, నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథ – కథనంలో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఈ సినిమాలో చరణ్ కి పోటీ ఇచ్చే స్టైలిష్ విలన్ కోసం కూడా అన్వేషణ జరుగుతోంది. ఈ సినిమాని ఎన్.వి ప్రసాద్ – డివివి దానయ్య కలిసి నిర్మిస్తున్నారు.

