ఆకట్టుకుంటున్న “చరిత కామాక్షి” ఫస్ట్ లుక్!

Published on Jul 21, 2021 5:52 pm IST


తెలుగు సినీ పరిశ్రమలోకి కొత్త తరం దర్శకులు వస్తున్నారు. అయితే నూతన దర్శకుడు స్త్రీ లంక చందు సాయి దర్శకత్వం లో ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ రెడ్డి నిర్మాణం లో వస్తున్న తాజా చిత్రం చరిత కామాక్షి. ఈ చిత్రం రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా గా తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రం లో నవీన్ బేతిగంటి మరియు దివ్య శ్రీపాద హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అయితే చరిత కామాక్షి రొమాంటిక్ డ్రామా అని ప్రకటించడం తో సినీ వర్గాల్లో ఈ చిత్రం పై చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదల అయింది. ఫస్ట్ లుక్ సైతం ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం కి అబు సంగీతం అందిస్తుండగా, రాకీ వనమాలి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :