చార్మి తల్లిదండ్రులు కరోనా..ఎమోషనల్ మెసేజ్.!

Published on Oct 25, 2020 3:33 pm IST

ఒకప్పుడు మన టాలీవుడ్ లో హీరోయిన్ గా మెస్మరైజ్ చేసిన టాప్ హీరోయిన్ చార్మి కౌర్ ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు నిర్మాణం వహిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈరోజు దసరా సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూనే ఒక ఎమోషనల్ మెసేజ్ ను పంచుకున్నారు.

ఈ అక్టోబర్ 22న తన తల్లిదండ్రులకు దురదృష్టవశాత్తు కరోనా సోకింది అని ఎప్పుడైతే లాక్ డౌన్ విధించారో అప్పటి నుంచి తాము చాలా పరిమితం అయ్యి ఇంటికే పరిమితం అయ్యామని కానీ ఇటీవలే వచ్చిన వరదల మూలాన ఇది జరిగి ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా ఈ వార్త విన్నాక తనకు మనసు ముక్కలయింది అని ఆ వెంటనే వారిని ఏ ఐ జి ఆసుపత్రికి తరలించామని వారికి ఆసుపత్రి వారు మంచి వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఇక ఈ సంఘటన తర్వాత తాను ఇవ్వదలచుకున్న సందేశం ఏమిటంటే కరోనా లక్షణాలు ఉన్నాయని అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చెయ్యొద్దని.

ఒకవేళ పాజిటివ్ వస్తే మొదటి దశలోనే దానిని అంత చెయ్యడానికి రెడీగా ఉండాలని దయచేసి ఈ విషయంలో అశ్రద్ధ చేయోద్దని రిక్వెస్ట్ చేసారు. ఇపుడు తన తల్లిదండ్రులను చూసేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నానని ఆ దుర్గా మాత ఆశీస్సులతో పాటు మీ ప్రార్ధనలు మా తల్లిదండ్రులకు కావాలని ప్రతీ ఒక్కరు సేఫ్ గా ఆరోగ్యంగా ఉండాలని చార్మి ఎమోషనల్ మెసేజ్ ను అందించారు.

సంబంధిత సమాచారం :

More