టాలీవుడ్ లో ఎన్నో సూపాట్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గ ఇమేజ్ తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ చార్మింగ్ గర్ల్ చార్మీ. ఈ రోజు ఛార్మీ పుట్టిన రోజు.. చార్మీకి ఈ జన్మదిన వేళ ఓ నిర్మాత నుంచి కాస్ట్లీ గిఫ్ట్ వచ్చింది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అంటే.. ప్రస్తుతం చార్మీతో ‘జ్యోతి లక్ష్మీ’ సినిమా చేస్తున్న సి. కళ్యాణ్. చార్మీకి బర్త్ డే కానుకగా సి. కళ్యాణ్ లయన్ షేప్ లో ఉన్న ఓ డైమండ్ రింగ్ ని బహుమతిగా ఇచ్చాడు. ఈ గిఫ్ట్ తో ఎంతో ఆనంద పడ్డ చార్మీ తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకుంది.
షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న జ్యోతి లక్ష్మీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు చార్మీ బర్త్ డే కానుకగా జ్యోతి లక్ష్మీ ఫస్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చార్మీ ఒక వేశ్యగా కనిపించనుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఓ హార్డ్ హిట్టింగ్ పాయింట్ తో పూరి ఈ సినిమా తీసాడు. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. సికె ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.


