సమంత, నాగ చైతన్య ‘మజిలి’ మొదలైయింది !

Published on Oct 10, 2018 4:08 pm IST

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం సమంత, నాగ చైతన్య ఈ రోజు నుంచి మజిలి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

ఈ చిత్రం టైటిల్‌ ‘మజిలి’ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఈ టైటిల్ నే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మజిలీ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారట. ఇక ఈ చిత్రం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కనుంది. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :