సెప్టెంబర్ నుండి సాయిపల్లవితో ‘నాగచైతన్య’ !

Published on Aug 25, 2019 3:55 pm IST

బలమైన కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ నుండి షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో క్రిస్టమస్ సందర్భంగా సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ సినిమాను అతి తక్కువ టైమ్ లో కేవలం 60 -70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :