ప్రయోగాలకు పెట్టింది పేరైన విశ్వ నటుడు కమల్ హాసన్ తాజాగా ‘చీకటి రాజ్యం’ పేరుతో మరో కొత్త ప్రయోగం చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ పనుల్లో ఉంది. రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అనౌన్స్ అయినరోజు నుంచే మంచి ఆసక్తి రేకెత్తించగా, ఈ మధ్యే విడుదలైన రెండు ట్రైలర్స్‌తో అంచనాలను పెంచేసింది. కమల్ హాసన్ స్టైల్ యాక్టింగ్, గ్రాండ్ విజువల్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా రన్‌టైమ్ విషయమై ఓ ఆసక్తికర అంశం ప్రస్తుతం హైలైట్‌గా నిలుస్తోంది. ఈ సినిమా 1 గంట 38 నిమిషాల షార్ప్ రన్‌టైమ్‌తో అలరించనుందని తెలుస్తోంది. షార్ప్ రన్‌టైమ్ అనేది ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళంలో పాపులర్ అయినా ఇప్పటికీ రెండున్నర గంటల రన్‌టైమ్ సాధారణంగా కనిపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో చీకటిరాజ్యం కేవలం 98 నిమిషాల నిడివితో రావడం విశేషంగానే చెప్పుకోవచ్చు. ఒకేఒక్క రాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్‌తో పాటు త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో తూంగవనం పేరుతో తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు, తమిళ భాషల్లో దసరా కానుకగా నవంబర్ 10న విడుదల కానుంది.


