దర్బార్ లో మళయాల నటుడు !

Published on May 9, 2019 10:30 am IST

ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్ కొన్ని రోజులనుండి షెడ్యూల్ ముంబై లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవల ఈ సినిమా నుండి కొన్ని పిక్స్ లీక్ అవ్వడంతో చిత్ర బృందం అలర్ట్ అయ్యి షూటింగ్ స్పాట్ లోకి బయటి వారిని రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యంగ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ మరో విలన్ గా నటించనున్నాడు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More