చ్చపాక్ విడుదల తేది ఖరారు !

చ్చపాక్ విడుదల తేది ఖరారు !

Published on Apr 23, 2019 3:40 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం చ్చపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా , లక్ష్మిపాత్రలో కనిపించనుంది. ఇక ఈ చిత్రం ఢిల్లీ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న విడుదలకానుంది.

మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా లుక్ ఇప్పటికే వైరల్ అయ్యింది. ఇక లక్ష్మి అగర్వాల్ 2005 లో యాసిడ్ దాడికి గురైయింది. ఆ తరువాత 7 సర్జరీ లు చేసుకుంది. ప్రస్తుతం ఆమె యాసిడ్ సేల్స్ ను నిరోధించాలని పోరాటం చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు