“రామ్ అసుర్” చిత్రాన్ని వీక్షించి యూనిట్‌ని అభినందించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్..!

“రామ్ అసుర్” చిత్రాన్ని వీక్షించి యూనిట్‌ని అభినందించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్..!

Published on Nov 25, 2021 8:00 PM IST


అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రామ్ అసుర్”. చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శెర్రి అగర్వాల్ హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించగా, విడుదలైన తొలి రోజు నుంచి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను దక్కించుకుంటుంది. ఈ సినిమాలో కథ హైలైట్ కాగా అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్, శానీ సల్మాన్ ల నటన మెయిన్ హైలైట్‌గా నిలిచింది. హీరోయిన్స్ గ్లామర్ అదనపు ఆకర్షణ. దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ సరికొత్త కథ కథనాలతో ఆద్యంతం ఈ సినిమాను ప్రేక్షకులు అలరించే విధంగా ముందుకు తీసుకెళ్లారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కొన్ని నగరాల్లో ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించిన చిత్ర బృందం తాజాగా వరంగల్‌లో సందడి చేసింది. గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారితో కలిసి సినిమాను వీక్షించింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ “రామ్ అసుర్” సినిమా అద్భుతంగా ఉందని, హీరో అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్‌ల నటన చాలా బాగుందని అన్నారు. ప్రత్యేకమైన పాత్రలో శానీ సల్మాన్ మంచి నటన కనపరిచాడని, దర్శకుడు వెంకటేష్ ఈ సినిమాను మంచి కథతో తెరకెక్కించి విజయం సాధించారు. ఈ చిత్రాన్ని యూనిట్ తో కలిసి వీక్షించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు