మెగా మేనల్లుడుతో ‘చినబాబు’ నిర్మాత !

మెగా మేనల్లుడుతో ‘చినబాబు’ నిర్మాత !

Published on Jul 16, 2018 6:56 PM IST

మరో మెగా మేనల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వనున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. నిజానికి వైష్ణ‌వ్ తేజ్‌ కూడా ఎప్పటి నుంచో హీరో అవ్వటానికి తగిన కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘చినబాబు’ నిర్మాత రామ్ తాళ్లూరి వైష్ణ‌వ్‌ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. రామ్ తాళ్లూరి గతంలోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ దర్శకుడు సాగర్‌ కె. చంద్రతో సినిమా చేయాలని నిర్ణయించుకుని ఉన్నారు.

కాగా వైష్ణ‌వ్‌ తేజ్, సాగర్‌ కె. చంద్ర కాంబినేషన్ లో సినిమా చెయ్యటానికి రామ్ తాళ్లూరి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైష్ణ‌వ్ సినిమా పూర్త‌య్యాక‌ సాయిధ‌ర‌మ్ తేజ్ తోనూ రామ్ తాళ్లూరి ఓ సినిమా నిర్మించనున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు