మెగాస్టార్ – కొరటాల మూవీ లేటెస్ట్ అప్ డేట్ !

Published on May 10, 2019 4:00 am IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జూలై నుంచి మొదలు కానుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే అది మళ్ళీ పోస్ట్ ఫోన్ అయినట్లు తెలుస్తోంది. ‘సైరా నర్సింహారెడ్డి’ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా కూడా ఆలస్యంగా ప్రారంభం కానుందట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగష్టు నుండి మొదలవొచ్చని సమాచారం.

ఇక చిరు కోసం కొరటాల ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేశారట. మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది. ఈ చిత్రంలో సునీల్, అనసూయ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తునట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ కూడా వచ్చాయి. మరి వాటిల్లో ఎంత నిజం ఉందో సినిమా స్టార్ట్ అయితే గాని తెలియదు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More