యువరాజ్ కుమార్ వివాహానికి అతిధిగా హాజరైన చిరంజీవి.

Published on May 28, 2019 10:19 am IST

కన్నడ సినీపరిశ్రమలో ప్రముఖ నటుడు మరియు నిర్మాత అయిన రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు యువరాజ్ కుమార్ వివాహం మైసూరు లో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. యువరాజ్ కుమార్ తాను ప్రేమించిన శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. సౌత్ సినీ పరిశ్రమల నుండి ఎందరో ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

తెలుగు పరిశ్రమ నుండి మెగా స్టార్ చిరంజీవి సతీ సమేతంగా వెళ్లడంతో ఈ వివాహం ప్రాధాన్యత సంతరించుకుని. రాఘవేంద్ర రాజ్ కుమార్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చిరు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఇంకా కన్నడ పరిశ్రమ నుండి ఉపేంద్ర, “కే జి ఎఫ్” స్టార్ యష్,యంగ్ హీరోయిన్ రష్మిక ఈ వివాహానికి హాజరై సందడి చేశారు.

సంబంధిత సమాచారం :

More