జక్కన్న, కొరటాల కాంప్రమైజ్ ఐతేనే అది సాధ్యం -చిరు

Published on Apr 5, 2020 11:29 am IST

మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి కాగా కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేక్ పడింది. మే నుండి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. కాగా ఈ చిత్రంలో మహేష్ నటిస్తున్నారని చాల కాలం ప్రచారం జరిగింది. ఆయనకు భారీ రెమ్యూనరేషన్ చెల్లించి తీసుకున్నారని అనేక మాధ్యమాలలో ప్రచురించడం జరిగింది. చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూ లో ఈ విషయం పై స్పందించారు.

”మొదటినుండి ఈ మూవీలోని ఓ పాత్ర కోసం కొరటాల చరణ్ నే అనుకుంటున్నారు. ఐతే మహేష్ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు. మహేష్ నాకు బిడ్డతో సమానం, అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే అంశం. కానీ ఈ చిత్రం కోసం మహేష్ ని అసలు అనుకోలేదు. చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ కోరిక కూడా చరణ్ ఈ మూవీలో నటించాలని. ఐతే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. కొరటాల, రాజమౌళి కాంప్రమైజ్ అయితేనే ఇది సాధ్యం అవుతుంది” అని చిరంజీవి అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More