వెబ్ సిరీస్ మొదలుపెట్టిన చిరంజీవి కుమార్తె.

Published on Jul 11, 2020 12:57 pm IST

చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ప్రొడ్యూసర్ గా మారారు. దీనిపై కొద్దిరోజులుగా వార్తలు వస్తుండగా…నేటితో స్పష్టత వచ్చింది. సుస్మిత నిర్మాతగా నేడు ఓ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. సుస్మిత తల్లిగారైన సురేఖ ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. పూజ కార్యక్రమాలతో వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైనది. ఈ వెబ్ సిరీస్ నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్ అయిన సుస్మిత చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150 మరియు సైరా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ఇప్పటికే చిరంజీవి కుమారుడు చరణ్ నిర్మాతగా ఉండగా, సుస్మిత కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

More