మెగాస్టార్ సినిమా కోసం కొరటాల ?

మెగాస్టార్ సినిమా కోసం కొరటాల ?

Published on Aug 26, 2019 10:00 AM IST

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోందట. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదట. వచ్చే వారంలో ఈ సినిమాలో చిరు లుక్ కి సంబంధించి లుక్ టెస్ట్ జరగనుందట. ఈ లుక్ టెస్ట్ ను బట్టే సినిమాలో మెగాస్టార్ గెటప్ ను డిసైడ్ చెయ్యాలని కొరటాల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. మెగాస్టార్, ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు