చిరంజీవికి ఆ పాఠశాలలకు సంబంధం లేదట !

Published on May 13, 2019 4:59 pm IST

చిరంజీవి పేరిట చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభమవుతున్నాయనే వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే. సంస్థకు చిరంజీవి పేరు ఉండటం ఫౌండర్ పేరు శ్రీ చిరంజీవి, అధ్యక్షులుగా శ్రీ నాగబాబు పేరు ఉండటంతో అవి చిరంజీవి స్థాపించిన పాఠశాలలే అని, అవి వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయనే అభిప్రాయం మొదలైంది అందరిలో. కానీ ఈరోజు సంస్థల సీఈవో జె.శ్రీనివాస్ రావు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

తాము చిరంజీవి అభిమానులం కావడం వలన ఆయన పేరుతో సంస్థను ఏర్పాటు చేశామని, మెగా కుటుంబం మీదున్న అభిమానంతో చిరంజీవిగారిని గౌరవ ఫౌండర్ పదవిలో, నాగబాబును గౌరవ అధ్యక్షుడి పదవిలో, రామ్ చరణ్‌ను గౌరవ చైర్మన్ పదవిలో నియమించుకున్నామని అంతేకానీ మెగా ఫ్యామిలీకి సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More