డిస్ట్రిబ్యూటర్ కు సపోర్ట్ గా నిలిచిన ‘చిరంజీవి’

chiranjivi
తెలుగు పరిశ్రమలో ‘చిరంజీవి’కున్న అభిమానం గణం మామూలుది కాదు. ప్రేక్షకుల నుండి డిస్ట్రిబ్యూటర్ల వరకూ ఆయనకు కొంతమంది పర్మినెంట్ అభిమానులున్నారు. వాళ్లంటే చిరంజీవికి కూడా అభిమానం ఎక్కువే. అందుకే వాళ్లకు వీలైనంత వరకూ సానుకూలంగానే స్పందిస్తుంటారు చిరు. ప్రస్తుతమ్ అయన చేస్తునం 150వ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ఉత్తరాంధ్రకు చెందిన ‘క్రాంతి పిక్చర్స్’ రెడ్డి పోటీలో నిలబడ్డారు.

కానీ చిరంజీవికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని పలువురు బిగ్ షాట్స్ ఈ పోటీలో పాల్గొనడటంతో హక్కులు దక్కించుకోవడం క్రాంతి పిక్చర్స్ కు కష్టంగా మారింది. దీంతో చిరు రంగంలోకి దిగి తన కుటుంబానికి ఎన్నాళ్లగానో సన్నిహితుడైన అతనికి సపోర్ట్ చేసి హక్కులు అతనికే దక్కేలా చేశారని తెలుస్తోంది. ‘వివి. వినాయక్’ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘రామ్ చరణ్ తేజ్’ స్వయంగా నిర్మిసున్నారు.