‘స్వచ్చ భారత్’కు మద్దతు తెలిపిన మెగస్టార్ చిరంజీవి.

‘స్వచ్చ భారత్’కు మద్దతు తెలిపిన మెగస్టార్ చిరంజీవి.

Published on Oct 11, 2014 2:28 PM IST

chiru1
మాహాత్మ గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావని లక్ష్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినిమా రంగ ప్రముఖులు కృషి చేస్తున్నారు. అమీర్ ఖాన్, కమల్ హాసన్, సూర్య తమ మద్దతును ప్రకటించారు. తాజాగా ఈ లిస్టులో చేరిపోయారు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ‘స్వచ్ఛభారత్‌’కు మద్దతు తెలుపుతూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
నమస్తే.. శుభ్రతగా ఉండడం దైవభక్తితో సమానం. మనం శుభ్రత పాటించకపోతే భగవంతుని ఆశీసులు లభించవని మహాత్మా గాంధీజీ చెప్పారు. శుభ్రత లేని నగరంలో స్వచ్చమైన మనుషులు జీవించలేరు. మన పరిసరాలను, గ్రామాలను, నగరాలను శుభ్రంగా ఉంచడం కోసం కృషి చేద్దాం.మనకు పెద్దగా ఖర్చు లేని పని ఇది. గాంధీజీ స్ఫూర్తితో, గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోడి ‘స్వచ్ఛభారత్‌’కు పిలుపునిచ్చారు. రండి, మనందరం మద్దతు తెలుపుదాం. జైహింద్ అంటూ వీడియోలో తన ప్రసంగాన్ని ముగించారు చిరు.

తాజా వార్తలు