ట్విట్టర్ లోకి మెగాస్టార్ ఎంట్రీ టైమ్ అదే !

Published on Mar 25, 2020 10:13 am IST

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలతో మెగా అభిమానులు ఆనందిస్తున్నారు. ఈ పవిత్రమైన ఉగాది పండుగ రోజున చిరు ట్విట్టర్ లో చేరనున్నారు. ఈ ఉదయం 11:11 గంటలకు చిరు ట్విట్టర్‌లో మొదటి పోస్ట్ చేయనున్నారు. అభిమానులు మెగాస్టార్ ట్విట్టర్ ఐడీని @KCiruTweets అనుసరించవచ్చు. ఇంతకీ మెగాస్టార్ మొదటి పోస్ట్ ఏమి చేస్తారా అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిరు తన సోషల్ మీడియాలో మొదటి పోస్ట్ గా చేస్తాడేమో చూడాలి.

కాగా ఇప్పటికే చిరు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. మెగాస్టార్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకూ 383 కె కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇంకా చాల విస్తృతంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. తన భావాలను ఫ్యాన్స్ తో పంచుకోవటానికి ఉగాది నుండి చిరు సోషల్ మీడియాలోకి వస్తోన్నారు. కరోనా వైరస్ భయం కారణంగా కలత చెందిన మెగా అభిమానులందరికీ చిరు డిజిటల్ అరంగేట్రం కొంత విశ్రాంతిని తెస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మెగాస్టార్ మొదటి ట్వీట్ కోసం వేచి చూద్దాం.

సంబంధిత సమాచారం :

X
More