యంగ్ లుక్ లో చిరుని ప్రెజెంట్ చేయనున్న కొరటాల

Published on Nov 9, 2019 10:30 am IST

సైరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేతులు కలిపారు. తన 152వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ కొద్దిరోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీ కొరకు చిరు సన్నద్ధం అవుతున్నారు. సినిమా కథ రీత్యా చిరంజీవి యంగ్ లుక్ లో కనిపించాలట. అందుకే కొరటాల చిరుని కొంత వెయిట్ తగ్గాల్సిందిగా సూచలనలు ఇచ్చారట. దీనితో చిరు జిమ్లో నిపుణుడి సమక్షంలో వర్క్ ఔట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ మూవీ షూటింగ్ కొంచెం ఆలస్యం కావడానికి కూడా ఇదే కారణంగా కనిపిస్తుంది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More