మెగాస్టార్ ల్యాండ్ మార్క్ మూవీ హిందీలో…!

Published on Jul 31, 2019 8:22 am IST

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో “ఖైదీ నంబర్ 150” తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా, 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. చిరంజీవి 150వ చిత్రంగా వచ్చిన “ఖైదీ నంబర్ 150” లో ఆయన “అందరివాడు” చిత్రం తరువాత మరో మారు డ్యూయల్ రోల్ చేయడం జరిగింది. ఐతే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుంది.

అక్షయ్ కుమార్ హీరోగా జగన్ శక్తి దర్శకత్వంలో “ఇక్కా” పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ విషయాన్నీ దర్శకుడు జగన్ శక్తి స్వయంగా ధృవీకరించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన “మిషన్ మంగళ్” ఆగస్టు 15న విడుదల కానుండగా,మరో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. “మిషన్ మంగళ్” సినిమా సమయంలోనే ఈ మూవీ గురించి చర్చలు జరపడం జరిగిందన్న జగన్ శక్తి అతి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాం అని అన్నారు. గతంలో జగన్ శక్తి చీనీ కమ్, ఇంగ్లీష్ వింగ్లిష్, పా వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు, “మిషన్ మంగళ్” దర్శకుడిగా ఆయనకు మొదటి సినిమా.

ఖైదీ నంబర్ 150 తమిళ చిత్రం “కత్తి”కి తెలుగు రీమేక్. మురుగదాస్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా 2014లో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. గతంలో మురుగదాస్,విజయ్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ చిత్రాన్ని, అక్షయ్ హాలిడే పేరుతొ హిందీలో రీమేక్ చేసి విజయం అందుకున్నారు.

సంబంధిత సమాచారం :