
మెగా అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొంత కాలంగా సరైన కథ కోసం మెగా కాంపౌండ్ అన్వేషణ సాగిస్తుంది. ఈ ఖాళి సమయంలో చిరంజీవి తన ఫిజిక్ మీద దృష్టి పెట్టారు. రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత చిరు కాస్త లావయ్యారు. 150వ సినిమా కోసం కొంత సన్నబడ్డారు, తాజా సమాచారం ప్రకారం మరింత స్లిమ్ అవ్వనున్నారు.
ప్రస్తుతం చిరంజీవి కేరళలో ఉన్నారు. ఒక ప్రముఖ ప్రకృతి వైద్యశాలలో ఆయుర్వేద మసాజ్ లతో పాటు కాయకల్ప చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న లుక్ కంటే మరింత స్లిమ్ & యంగ్ లుక్ లో తన 150వ సినిమాలో కనిపించాలని చిరు కష్టపడుతున్నారు. ఈ వార్త మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

