చిరు 151వ సినిమా నటీనటుల ప్రకటన !

21st, August 2017 - 05:17:15 PM


మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ప్రకటన వెలువడిన దగ్గరనుంచి ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ ఎవరు, మిగతా నటీనటులు ఎవరు అనే వివరాలు తెలుసుకోవాలని అందరూ చాల ఆత్రుతగా ఉన్నారు. అందుకే అభిమానుల్ని ఇంకేమాత్రం వేచి చూసేలా చేయడం ఇష్టం లేని చిరు టీమ్ రేపు చిరు పుట్టినరోజు సందర్బంగా నటీనటుల వివరాల్ని ప్రకటించనున్నారు.

రేపు ఉదయం గచ్చిబౌలిలో 9 గంటల 30 నిముషాలకు జరగబోయే కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు. అంతేగాక ఈ వేడుకలోనే సినిమా లోగోను, మోషన్ పోస్టర్ ను దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేయించనున్నారు. ఈ వార్తతో సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటి నుండే హంగామా మొదలుపెట్టేశారు. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనుండగా రామ్ చరణ్ నిర్మాణ భాద్యతల్ని భుజానవేసుకున్నారు.