ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా ఫాలోయింగ్ మొదలైంది !

Published on Mar 24, 2020 10:00 pm IST

ఈ ఉదయం, మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో సన్నిహితంగా ఉండటానికి రేపు సోషల్ మీడియాలోకి ఎంటర్ అవ్వబోతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, తాజా వార్త ఏమిటంటే, చిరు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. అప్పుడే మెగాస్టార్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో 316 కె కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇంకా చాల విస్తృతంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా ఫాలోయింగ్ మొదలైందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మొత్తానికి ఇక నుండి తన భావాలను అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ప్రజలతో ఫ్యాన్స్ తో పంచుకోవటానికి ఉగాది నుండి సోషల్ మీడియాలోకి వస్తోన్న మెగాస్టార్ కి ఫ్యాన్ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మెగాస్టార్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు నెలలో చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.

సంబంధిత సమాచారం :

X
More