‘మెగా అల్లుడి’ రెండో చిత్రానికి మెరుగులు !

Published on Jul 21, 2019 9:39 pm IST

గత సంవత్సరం, మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ తన రెండువ సినిమాని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే చిత్రబృందం ఇప్పటివరకు చిత్రీకరించిన ఫుటేజ్ ను చూసిందట. స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేస్తే బాగుంటుందని భావించిన టీం.. షూటింగ్ కి విరామం ఇచ్చి.. ప్రస్తుతం స్క్రిప్ట్ పై మరియు డైలాగ్‌ లపై వర్క్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. ఇక అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం పై కూడా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :