‘తకిట తకిట’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ భక్తి పుంజని. ఆ తర్వాత అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ లో కనిపించిన ఈ భామ గత వారం విడుదలైన ‘బూచమ్మ బూచోడు’ సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. ఈ సినిమాలో భక్తి చేసిన పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఆమెతో కాసేపు చిట్ చాట్ చేసాం..
ప్రశ్న) ‘బూచమ్మ బూచోడు’ సినిమా అవకాశం ఎలా వచ్చింది.?
స) ‘తకిట తకిట’ నుంచి గోపి గారు నాకు బాగా తెలుసు. ఈ సినిమా అనుకున్నప్పుడు ఆయన నన్ను ముంబై నుంచి రమ్మని కథ వినిపించారు. కథ నచ్చింది కానీ నాది ఘోస్ట్ రోల్ అని చెప్పినప్పుడే కాస్త ఆలోచించాను. ఫైనల్ గా డైరెక్టర్ రేవన్ గారు ఇచ్చిన ఫుల్ సపోర్ట్ తోనే ఈ సినిమా చేయగలిగాను.
ప్రశ్న) మరి మీ రోల్ ఘోస్ట్(దెయ్యం) అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏమిటి.?
స) నాకు కథ నచ్చింది. కానీ ఘోస్ట్ రోల్ నేను చెయ్యలేను. ఎందుకంటే నా ఒరిజినల్ స్వభావానికి పూర్తి విరుద్దమైన పాత్ర. నేను ఘోస్ట్ లా అరవడం, భయపెట్టడం చేయలేను. ఘోస్ట్ రోల్ అంటే ఆ పాత్రలో మనం ఆడియన్స్ ని భయపెట్టాలి కానీ అలా నేను చేయలేనని నో చెప్పాను. కానీ డైరెక్టర్ గారే చెయ్యగలవని చెప్పి కొద్ది రోజులు వర్క్ షాప్ చేసి తర్వాత సెట్స్ పైకి వెళ్లాం.
ప్రశ్న) మరి మీ పాత్రకి రెస్పాన్స్ ఎలా వస్తోంది.? మీ పాత్రకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి.?
స) సినిమా రిలీజ్ అయిన తర్వాత నా పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అస్సలు నేను ఊహించనేలేదు. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. చాలా మంది నుంచి నా పెర్ఫార్మన్స్ చాలా బాగుందని కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఘోస్ట్ గా ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చావని అన్నారు.
ప్రశ్న) ఈ సినిమాలో మీ ఫేవరైట్ సీన్ ఏమిటి.?
స) నా ఫేవరైట్ సీన్ మాత్రం క్లైమాక్స్ ఎపిసోడ్. ఆ సీన్ ని పెద్ద చాలెంజ్ లాగా తీసుకొని చేసాను. ఇలాంటి సీన్స్ చేస్తాప్పుడే మనలోని టాలెంట్ కూడా భయతపడుతుంది.
ప్రశ్న) మీ కో స్టార్స్ శివాజీ, కైనాజ్ మోతీవాల గురించి చెప్పండి.?
స) శివాజీ గారి మొదటి నుంచి బాగా సపోర్ట్ చేస్తూ కావలసినట్టు సీన్స్ చేయించుకునేవారు. శివాజీ గారు స్వతహాగా కూడా చాలా మంచి వ్యక్తి. నేను ఎక్కడన్నా టెన్షన్ పడుతుంటే కాస్త బ్రేక్ తీసుకోమని మళ్ళీ సెట్ అయ్యాక ఆ సీన్స్ షూట్ చేయించారు. కైనాజ్ మోతీవాలా చాలా సింపుల్ గా ఉంటుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా చేసాను అన్న ఫీలింగే లేకుండా అందరితో కలిసి పనిచేస్తుంది.
ప్రశ్న) డ్రీం రోల్స్ ఏమన్నా ఉన్నాయా.? గ్లామరస్ రోల్స్ మరియు బికినీ వేయడానికి మీరు సిద్దమేనా.?
స) డ్రీం రోల్స్ అంటూ ఏమీ లేవు. నాకు వచ్చిన వాటిల్లో చాలెంజింగ్ గా అనిపించిన రోల్స్ చేయాలనేదే డ్రీం. ఈ మధ్య కథకి అవసరం లేకపోయినా బికినీ వేసేస్తున్నారు. కానీ నేను కథ డిమాండ్ చేస్తే తప్ప బికినీ వెయ్యడానికి నేను ఒప్పుకోను. కథ డిమాండ్ చేస్తేనే గ్లామర్ రోల్స్ కూడా చేస్తాను. ఉదాహరణకి థర్టీ పిక్చర్ లో విద్యాబాలన్ రోల్ కచ్చితంగా ఎక్స్పోజ్ చెయ్యాలి అలా కథ డిమాండ్ చేస్తే చేస్తాను. ఎక్కువగా నా టాలెంట్ ని నిరూపించుకునే పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలనే ఎక్కువగా ఎంచుకోవడానికి ట్రై చేస్తున్నాను.
అంతటితో తన కెరీర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ని ముగించాం..


