చిట్ చాట్ : రీమేక్ అనేది బిగ్ చాలెంజ్ – నాని

చిట్ చాట్ : రీమేక్ అనేది బిగ్ చాలెంజ్ – నాని

Published on Feb 12, 2014 1:10 PM IST

Aaha-Kalyanam1

యంగ్ హీరో నాని కొంత కాలం గ్యాప్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు వరుసగా సినిమాలు రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘పైసా’ సినిమా రిలీజ్ కాగా, ఫిబ్రవరి 21న ‘ఆహా కళ్యాణం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టీం మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘ఆహా కళ్యాణం’ మూవీ గురించి చెప్పండి?

స)
నాకు పెళ్ళిళ్ళ సీజన్ ఎప్పుడనేది తెలియదు. కాని ఈ నెల 21 తర్వాత నుంచి మాత్రం పెళ్ళిళ్ళ హంగామ మొదలవుతుందని చెప్పగలను. ఎందుకంటే థియేటర్ కి వచ్చే ప్రతి ప్రేక్షకుడు సినిమా అయ్యాక పెళ్లి మండపం నుంచి బయటకి వస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య కారణం మ్యూజిక్ హిట్ అవ్వడం. తమిళ్ తో పాటు తెలుగులో కూడా పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్ సాంగ్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. చెప్పాలంటే టీం అంతా ఈ సాంగ్ పెడదాం అంటే నేనే వద్దన్నాను. కానీ అదే పాత పెద్ద హిట్ అయ్యింది. నా నిర్ణయం తప్పు అయినందుకు టీం కి సారీ చెబుతున్నాను.

ప్రశ్న) రీమేక్ సినిమా కదా సేఫ్ సైడ్ అని ఈ మూవీని సెలెక్ట్ చేసుకున్నారా?

స) రీమేక్ సినిమా అంటే అందరికీ సేఫ్ సైడ్ అనే ఫీలింగ్ ఉంది. కానీ రీమేక్ అనేది చాలా పెద్ద చాలెంజ్ అని చెప్పాలి. ఎందుకంటే ‘బ్యాండ్ బాజా బారాత్’ అనేది ఓ సూపర్ హిట్ సినిమా దానిని చాలా మంది చూసేసి ఉంటారు. అది చూసిన ఫీలింగ్ రాకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడం పెద్ద చాలెంజ్. ఇది కాకుండా ఈ కాన్సెప్ట్ తోనే మన తెలుగులో కూడా సినిమా వచ్చిందనే వార్తలు కూడా ఉన్నాయి. ఇలా అనుకునే వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మన దగ్గర 5 లేదా 6 కథలు మాత్రమే ఉన్నాయి. వాటితోనే కొన్ని వందలు, వేల సినిమాలు చేసాం. బాగుంటే చూస్తారు లేదంటే చూడరు. ఒకవేళ మీరు ఇప్పటికే వచ్చిన సినిమాల వాళ్ళ పూర్తిగా హ్యాపీగా ఉంటే ఈ సినిమా చూడము అనుకుంటే పెద్ద సమస్య ఏమీ లేదు. కానీ ఆహా కళ్యాణం మాత్రం డిఫరెంట్ మూవీ. మొదటి ఫ్రేం నుంచి చివరి ఫ్రేం వరకు ఎంజాయ్ చేస్తారు అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను.

ప్రశ్న) కథలో ఏమన్నా మార్పులు చేసారా? మీ పాత్ర కోసం మీరు తీసుకున్న జాగ్రత్తలేమిటి?

స) హిందీ వెర్షన్ మొత్తం ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. కానీ ఆహా కళ్యాణం ని మాత్రం మన నేటివిటీకి తగ్గట్టు మార్చిచేసాము. మన పెళ్ళిళ్ళు, సాంప్రదాయాలు సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటాయి. అలాగే హిందీ కంటే కామిక్ టైమింగ్, వెటకారం మన దగ్గర ఎక్కువ. కావున హిందీ వెర్షన్ కన్నా ఇక్కడ ఎక్కువ కామెడీ ఉంటుంది. ఓవరాల్ గా అయితే మూవీ కంటెంట్ ని మాత్రం మార్చలేదు.

సినిమా మొదలయ్యే ముందు ఆ పాత్రలో రన్వీర్ సింగ్ చూసినప్పుడు అది నేను కాదని అనిపించింది. ఒక వేల నేను ఆ శక్తి అయితే ఎలా చేస్తానో అలానే చేసాను. ఫుల్ మూవీ చూసుకున్నాక అది నాని కాదు, అలా అని రన్వీర్ సింగ్ కాదు, ఎవరో కొత్త శక్తి అనే కొత్త వాడు వచ్చాడు. అది ఎలా ఉందనేది ప్రేక్షకులే చూసి చెప్పాలి.

ప్రశ్న) హీరోయిన్ వాణి కపూర్ గురించి చెప్పండి?

స) వాణి కపూర్ బాగా డెడికేషన్ ఉన్న హీరోయిన్. షూటింగ్ లో ప్రతి రోజు ప్రతి సీన్స్ కి సీన్ అంతా విన్న తర్వాత నేనే శృతి అయితే ఎలా ఉంటాను ఎలా చేస్తాను అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చేసేది. అలాగే తను చేసిన సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా ఇప్పటికే వాణి కపూర్ కి మంచి క్రేజ్ వచ్చింది.

చివరిగా హీరోయిన్ వాణి కపూర్ మాట్లాడుతూ ‘యష్ రాజ్ ఫిల్మ్స్ ద్వారా సౌత్ ఇండియాలో లాంచ్ అవ్వడం చాలా ఆనదంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని’ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు