“చిత్రపటం” మూవీ పాటను ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్..!

“చిత్రపటం” మూవీ పాటను ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్..!

Published on Jul 30, 2021 4:50 PM IST

chitra patam

సినీ గీత రచయితగా ఫ్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండారు దానయ్య కవి ఇదివరకే దర్శకుడిగా కూడా మారారు. అయితే తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం “చిత్ర పటం”. పార్వతీశం, శ్రీవల్లి ప్రధాన తారాగణంగా, శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, పోసాని, నరేన్, బాహుబలి ప్రభాకర్, శరణ్య పొన్నవన్, బాలాచారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి “నింగిని చూసి నేర్చుకున్న” అనే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం అన్ని కలగలిపిన చిత్రం ఇదని అన్నారు. ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న దర్శకనిర్మాతలకు, చిత్ర బృందాన్ని ఆయన అభినందనలు తెలిపారు.

చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ ప్రస్తుతం ఓ మనిషికి కావాల్సినవి ఇంటర్నెట్‌లో చాలా దొరుకుతున్నాయని, ఒక్క ఎమోషన్ మాత్రమే దొరకదని, దాన్ని ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశామని అన్నారు. ఓ తండ్రికీ, కూతురికి మధ్య సాగే కథతో ఈ చిత్రం ఉంటుందని, ఈ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయని వాటన్నిటికి నేనే సాహిత్యం, సంగీతాన్ని సమకూర్చానని అన్నారు. నిర్మాత పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు