చిత్రలహరి లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్ !

Published on Apr 20, 2019 9:08 pm IST

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి ఇటీవల విడుదలై ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంటున్న ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద మాత్రం తడబడుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం అక్కడ $272,678 వసూళ్లను రాబట్టుకుంది. దాంతో ఈచిత్రానికి స్వల్ప నష్టాలు తప్పేలా లేవు.

కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ , నివేతా థామస్ కథానాయికలుగా నటించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :