హీరో ‘విక్రమ్’ ఈసారి ఖచ్చితంగా నిరుత్సాహపరచడట !

iru-murugan
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రయోగాలను ఎక్కువగా ప్రోత్సహించే నటుల్లో ‘కమల్ హాసన్’ తరువాత హీరో ‘విక్రమ్’ ముందుంటాడు. శివపుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాలన్నీ ఆయనకు ఆ పేరును తెచ్చిపెట్టాయి. తాజాగా శంకర్ దర్శకత్వంలో నటించిన ‘ఐ’ సినిమా కూడా పెద్ద విజయం నమోదు చేయనప్పటికీ నటుడిగా విక్రమ్ స్థాయిని ఆకాశానికి పెంచింది. మళ్ళీ ఇప్పుడు విక్రమ్ అలాంటి ప్రయోగమే చేయనున్నాడు. దర్శకుడు ‘ఆనంద్ శంకర్’ దర్శకత్వంలో ‘ఇరుమురుగన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు.

పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మధ్యే విడుదలైన టీజర్ సైతం ఆకట్టుకునే విధంగా వైవిధ్యంగా ఉంది. సినీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గతంలోలా కాకుండా ఆధ్యంతం అలరించే థ్రిల్లింగ్, యాక్షన్ సన్నివేశాలతో ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్ర ఆడియో ఆగష్టు 2న చెన్నైలో దక్షిణ భారత స్టార్ హీరోలందరి నడుమ భారీ ఎత్తున జరగనుంది.