క‌మ‌ల్‌ గారికి మ‌రీ మ‌రీ థ్యాంక్స్‌ – హీరో విక్ర‌మ్

Published on Jul 17, 2019 6:57 pm IST

‘శివ‌పుత్రుడు, అప‌రిచితుడు’ చిత్రాల‌తో తెలుగులో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం.సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.ర‌విచంద్ర‌న్ బ్యాన‌ర్ పై రూపోందిన `క‌డ‌ర‌మ్ కొండాన్‌` చిత్రాన్ని తెలుగులో నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణలో నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్‌ పై జూలై 19న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌స్‌ప‌ల్లా హోట‌ల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

కాగా విలేక‌రుల స‌మావేశంలో.. టి. అంజ‌య్య ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ… మిస్ట‌ర్ కె.కె. ప్రీ రిలీజ్‌కి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రం వెనుకాల ఎంతో మంది పెద్ద‌ల క‌ష్టం ఉంది. హీరో విక్ర‌మ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో చాలా డిఫ‌రెంట్‌గా ట్రై చేశాను. మా ప్రొడ్యూస‌ర్స్‌కి థ్యాంక్స్‌. క‌మ‌ల్‌ గారికి మ‌రీ మ‌రీ థ్యాంక్స్‌. నాకు చాలా గ‌ర్వంగా ఉంది ఈ చిత్రంలో న‌టించినందుకు. రాజేష్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అన్నారు.

సంబంధిత సమాచారం :