‘చూసీ చూడంగానే’.. ట్రైలర్ విడుదల !

‘చూసీ చూడంగానే’.. ట్రైలర్ విడుదల !

Published on Dec 3, 2019 7:24 PM IST

శివ కందుకూరి హీరోగా శేష్ సింధూ రావ్ దర్శకత్వంలో రానున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృదం. ఓ అబ్బాయి లైఫ్ లో జరిగే ఎమోషనల్ అండ్ లవ్ ఇన్సిడెంట్స్ ను ఎలివేట్ చేస్తూ ట్రైలర్ సాగింది. ట్రైలర్ కాలేజీ లైఫ్ నుంచీ జాబ్, సెటిల్ వరకూ ఇలా ఒక కుర్రాడి లైఫ్ లోని అన్ని అంశాలను కవర్ చేశారు.

ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకురుస్తుండగా.. సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య, విశ్వ సాహిత్యం అందించారు. వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మపథ క్రియేషన్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఓ స్థానం కల్పించుకున్నారు రాజ్ కందుకూరి. ఆయన తనయుడు శివ కందుకూరి ఈ సినిమాతో హీరోగా పరిచయం ఆవుతున్నాడు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు