వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న క్రేజీ కొరియోగ్రాఫర్..!

Published on Jan 8, 2022 6:37 pm IST

అదిరిపోయే టాలెంట్‌తో ఇప్పుడిప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపించుకుంటున్న యంగ్ అండ్ క్రేజీ కొరియోగ్రాఫర్ “పొలాకి విజయ్”. వరుస సినిమాలతో దూసుకుపోతున్న కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్‌కి స్టార్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్యాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప ఫంక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్ గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. అలాగే పుష్పలో సమంత చేసిన “ఊ అంటావా.. ఉ ఉ అంటావా” సాంగ్‌కి పొలాకి విజయ్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఇతడి వర్క్ సమంతకు బాగా నచ్చడంతో ఆమె కూడా ఎంకరేజ్ చేస్తూ బెస్ట్ విశెస్ తెలియచేసింది.

రీసెంట్‌గా “పలాస 1978” సినిమాలో పెద్ద హిట్ అయిన ‘నక్కిలీసు గొలుసు’ సాంగ్ పొలాకి విజయ్‌కి పెద్ద పేరు తెచ్చి పెట్టింది. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

అలాగే విజేత, కొబ్బరిమట్ట, తిప్పరా మీసం, పలాస 1978, అల్లుడు అదుర్స్, శశి లాంటి అనేక చిత్రాలకు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చేసిన పొలాకి విజయ్ ఇటీవల పుష్పతో పాటు గల్లా అశోక్ “హీరో” చిత్రానికి కూడా కొరియోగ్రఫీ చేశాడు. “హీరో” సినిమాలో డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్‌కు విజయ్ కంపోజ్ చేసిన అదిరే స్టెప్పులకు మంచి పేరొస్తుంది. కాగా త్వరలో “నరకాసుర” చిత్రంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు పొలాకి విజయ్ పనిచేయబోతున్నారు. అయితే ఈ యంగ్ కొరియోగ్రాఫర్ స్పీడ్ చూస్తుంటే ఫ్యూచర్‌లో స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ ఇండస్ట్రీకి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం :