‘వాల్మీకి’ సెట్స్ లో హాలీవుడ్ ఆస్కార్ విన్నర్.

Published on Aug 5, 2019 2:56 pm IST

ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్ సన్ అనుకోకుండా “వాల్మీకి” సినిమా సెట్స్ లో సందడి చేశారు. ఆయన స్వయంగా ఓ సన్నివేశానికి గౌరవ సినిమాటోగ్రాపర్ గా పనిచేశారు. ఈ అద్భుత సంఘటనని దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.గాడ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, మూడు సార్లు ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు పొందిన రిచర్డ్ సన్ వాల్మీకి సెట్స్ కి రావడం జీవితంలో మరువలేని అనుభూతి అంటూ ఉద్వేగంగా హరీష్ ట్వీట్ చేశారు. జె ఎఫ్ కె(1991),ది ఏవియేటర్(2004), హ్యూగో(2011) చిత్రాలకు గాను రిచర్డ్ సన్ ఆస్కార్ అవార్డు పొందటం జరిగింది.

కాగా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, దర్శకుడు హరీష్ కామెడీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. తమిళంలో ఘనవిజయం సాధించిన “జిగర్తాండ” చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం :