భారీ బడ్జెట్ సినిమాను రీస్టార్ట్ చేసే పనిలో శంకర్

Published on Oct 23, 2020 7:03 pm IST


కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. అందుకే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే మొదటి నుండి ఈ సినిమాకు మొదటి నుండీ కాష్టాలే ఎదురవుతున్నాయి. మొదట్లో బడ్జెట్ విషయంలో శంకర్, నిర్మాతల మధ్యన విబేధాలు తలెత్తడంతో బడ్జెట్ ను సగానికి కుదించి సినిమా పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు శంకర్. కానీ ఆ తర్వాత సెట్లో ప్రమాద జరగడం, ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ వంటి అడ్డంకులు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకురాలేదు. మరోవైపు కమల్ హాసన్ సైతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే ఫొటోషూట్ కూడ నిర్వహించారు. దీంతో ‘ఇండియన్ 2’ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. శంకర్ సైతం ఇంకో ప్రాజెక్ట్ చేసుకోవడానికి నిర్మాతల నుండి అనుమతులు కోరినట్టు చెబుతున్నారు.

కానీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు మాత్రం ఆలాంటిదేం లేదని, ప్రాజెక్ట్ ఉందని, కాకపోతే భారీ క్రూతో షూటింగ్ జరపాల్సి ఉండటంతో ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు కోరుతున్నట్టు, అందుకే ఆలస్యమవుతోందని క్లారిటీ ఇచ్చారు. కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్, బాబీ సింహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More