ఎన్టీఆర్ సినిమా కథపై వచ్చినవ వార్తలన్నీ రూమర్లేనట !

11th, February 2018 - 01:35:29 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కలయికలో కొత్త చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కథ గురించి రకరకాల వార్తలు వినిపించాయి. ఈ చిత్ర కథను త్రివిక్రమ్ ప్రముఖ రచయిత మధు బాబు యొక్క నవల ఆధారంగా రూపొందిస్తున్నారని అన్నారు. కానీ అలాంటిదేం లేదని రచయిత మధు బాబు అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కథ విషయమై తనను సంప్రదించలేదని ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితంకానున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ మార్చి నెలలో ప్రారంభంకానుంది. ఇంకో పది రోజుల్లో చిత్ర టీమ్ హీరోయిన్, సినిమాటోగ్రఫర్, సంగీత దర్శకుడు వంటి వారి వివరాలను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు.