సమంత సినిమాలు ఆపేయడం లేదు !

Published on Jul 7, 2018 1:10 pm IST

ఈ ఏడాది వరుస బ్లాక్ బ్లాస్టర్ విజయాలను సొంతం చేసుకున్న ఏకైక నటి సమంత. ప్రస్తుతం తెలుగు , తమిళ బాషలలో నటిస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె గురించి కొద్దీ రోజులగా ఓక వార్త హల్చల్ చేస్తుంది. 2019 నుండి ఆమె ఇక సినిమాలలో నటించరని తరువాత ఫ్యామిలీకే అంకితమవుతారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ఇవ్వని కేవలం రూమర్లు మాత్రమేనని తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ‘యు టర్న్’చిత్రంలో నటిస్తుంది . ఈ చిత్రం తరువాత నాగ చైతన్య తో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారు . ఇక ఈచిత్రాల తరువాత మరో రెండు పెద్ద ప్రాజెక్టులను ఓకే చేసిందని సమాచారం . అంటే ఇప్పట్లో ఆమె సినిమాలకు దూరం కారని తెలుస్తుంది . సమంత మరి కొన్ని సంవత్సరాలు తన కెరిర్ ను ఇలాగే కొనసాగించనున్నారు. ఈ వార్త ఆమె అభిమానులకు ఆనందాన్నికలిగించేదే.

సంబంధిత సమాచారం :