పవన్ – సురేందర్ రెడ్డి మూవీ పై లేటెస్ట్ క్లారిటీ!

Published on Sep 6, 2023 10:08 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూనే వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ఫుల్ స్వింగ్ తో దూసుకెళ్తున్నాయి. అయితే స్టైలిష్ ఫిల్మ్ మేకర్ అయిన సురేందర్ రెడ్డి తో పవన్ కళ్యాణ్ మూవీ అనౌన్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది పవన్ బర్త్ డే కి ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ కూడా రిలీజ్ కాలేదు.

అయితే ఆఫీస్ ఒకటి స్టార్ట్ చేసి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రీమేక్, ఫ్రిమేక్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ చిత్రం స్ట్రెయిట్ సినిమా అని లేటెస్ట్ సమాచారం. మేకర్స్ దీనిపై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం కి సంబందించిన అప్డేట్స్ కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :