ఎన్టీఆర్ బయోపిక్లో ఆ క్లాసిక్ సాంగ్ ను మళ్ళీ గుర్తుచేస్తున్నారు !

ఎన్టీఆర్ బయోపిక్లో ఆ క్లాసిక్ సాంగ్ ను మళ్ళీ గుర్తుచేస్తున్నారు !

Published on Oct 9, 2018 4:56 PM IST


లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘యన్ టి ఆర్ బయోపిక్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా రానునుంది. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్ , శ్రీదేవి నటించిన ‘వేటగాడు’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఆకు చాటు పింద తడిసె’ను ఈ చిత్రంలో మళ్ళీ చూపించనున్నారు. బాలకృష్ణ – రకుల్ ప్రీత్ సింగ్ లపై ఈ పాటను చిత్రీకరించనున్నారట. ఇక రకుల్ ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటించనున్నదని తెలిసిందే. ఈవారం నుండి ఆమె షూటింగ్ లో పాల్గొననుంది.

ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని ఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈచిత్రంలోని రెండవ భాగం ‘మహానాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 24న విడుదలకానుంది. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు