‘ఇస్మార్ట్’కి బాగా కలిసొస్తోన్న ప్రమోషన్స్ !

Published on Jul 31, 2019 7:06 pm IST

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద గుడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఈ చిత్రం 11 రోజులకు గానూ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. చాలా ప్రాంతాల్లో లాభాల జోన్‌ లోకి వెళ్ళిపోయింది. ఈ చిత్రం ఏపీ మరియు తెలంగాణలో బి మరియు సి కేంద్రాల్లో ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. మేకర్స్ కూడా వినూత్నంగా తెలివైన ప్రమోషన్లు చేస్తుండటం కూడా సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది.

మొదటి రోజు నుండి, ఇస్మార్ట్ శంకర్ టీమ్ ప్రమోషన్లను చాలా బాగా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సినిమాకి వస్తోన్న ఆదరణను కూడా అప్ డేట్ చేస్తూ… సినిమాని చూడని ప్రేక్షకుల్లో కూడా సినిమా పై క్యూరియాసిటీని పెంచేలా చేస్తున్నారు. మరో పక్క డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా సాగడం.. అలాగే ప్రస్తుతం ఎలాంటి పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడం కూడా ఇస్మార్ట్‌ కు బాగా కలిసొస్తోంది.

సంబంధిత సమాచారం :