యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ ఆ మధ్య ఓ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో తరుణ్ తో పాటు వెంకటేష్ కూడా అంత బాగా సంతృప్తి చెందలేదని, అందుకే.. సినిమాని పోస్ట్ పోన్ చేశామని.. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ్ బాస్కర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తరుణ్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట. సెకెండ్ హాఫ్ ను పూర్తిగా ఫినిష్ చేసి.. అలాగే క్లైమాక్స్ కూడా వెంకీకి బాగా నచ్చాకే సినిమా మొదలవుతుంది.
కాకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తరువాత ఉంటుందని తెలుస్తోంది. నారప్ప షూటింగ్ పూర్తవ్వగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందట. కాగా తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ సినిమా కాలేజీ నెపథ్యంలో సాగుతుందని, వెంకీ లెక్చరర్ గా నటించబోతున్నాడని.. చాలా వరకు సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ఇప్తెపటికే వార్లుతలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై తరుణ్ నుండి క్లారిటీ లేదు. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.


