పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ హారర్ ఫాంటసీ ప్రచార కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు బాగానే సాగాయి. సినిమాలోని చివరి పాటను కూడా విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఐతే, ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, సంగీత దర్శకుడు తమన్ తన ఎక్స్ ఖాతాలో ఒక క్రేజీ పోస్ట్‌ను పంచుకున్నారు: “క్లైమాక్స్. ఐమ్యాక్స్. మారుతి మ్యాక్స్” అంటూ పోస్ట్ పెట్టారు.
మొత్తానికి ఈ సినిమా క్లైమాక్స్ హై-వోల్టేజ్గా ఉండబోతుందని తమన్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
C-L-I-M-A-X
I -M-A-X
M-A-R-U-T-H-I-M-A-X???? ????????????
— thaman S (@MusicThaman) January 4, 2026


